శుక్రవారం, 12 సెప్టెంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-09-2025 సోమవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

tula rashi-7
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ రోజు కొంత మేరకు అనుకూలం. సమయస్ఫూర్తితో మెలగండి. రుణసమస్య నుంచి బయటపడతారు. ఖర్చులు సామాన్యం. బాధ్యతలు అప్పగించవద్దు. అనుకోని సంఘటన ఎదురవుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కష్టం వృధాకాదు. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఖర్చులు అధికం, పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. వ్యాపకాలు అధికమవుతాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మొండిధైర్యంతో అడుగు ముందుకేస్తారు. సాహసించి తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. బంధువులతో సంభాషిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. అనవసర జోక్యం తగదు. పరిచయాలు బలపడతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. లౌక్యంగా వ్యవహరించాలి. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం గ్రహిస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. ఆశించిన పదవి దక్కదు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అనుకున్నది సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. అవసరాలకు ధనం అందుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. లక్ష్యానికి చేరువలో ఉన్నారు. అపజయాలకు కుంగిపోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. అప్రమత్తంగా మెలగండి. ప్రలోభాలకు లొంగవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంప్రదింపులతో సతమతమవుతారు. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకోండి. కొంతమొత్తం ధనం అందుతుంది. మానసికంగా స్థిమితపడతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ధార్మిక విషయాలపై దృష్టి పెడతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
తప్పటడుగు వేస్తారు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. పెద్దల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. పత్రాలు, నగదు జాగ్రత్త. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యం సిద్ధిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రయాణం విరమించుకుంటారు 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వాగ్ధాటితో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. కిట్టని వారితో జాగ్రత్త. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఖర్చులు అదుపులో ఉండవు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి.