మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2019 (09:08 IST)

08-04-2019 సోమవారం దినఫలాలు...

మేషం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలూ సామాన్య ఫలితాలనే ఇస్తాయి. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించండి. విద్యార్థులకు శుభవార్త శ్రవణం. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు కార్మికుల వలన ఇబ్బందులు తప్పవు.
 
వృషభం: ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. పాత బిల్లులు చెల్లిస్తారు. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి రాగలవు. స్త్రీలు పనివారలతో సమస్యలు ఎదుర్కుంటారు. సమయస్పూర్తిగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
మిధునం: రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరలు నిరుత్సాహపరుస్తాయి. మితిమీరిన ఆలోచనలు, శ్రమాధిక్యత వలన స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత, మెళకువ చాలా అవసరం.
 
కర్కాటకం: ఉద్యోగస్తులకు, మార్కెట్ రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. కీలకమైన వ్యవహారాల్లో జయం, మొండిబాకీల వసూళ్లు వంటి శుభ సంకేతాలున్నాయి. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో లౌక్యం అవసరం. ఏ విషయంలోను వాదించకుండా రాజీ మార్గం అనుసరించండి.
 
సింహం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాలవారికి చికాకులు అధికమవుతాయి. మీ సంతానం భవిష్యత్తుకోసం ప్రణాళికలు రూపొందిస్తారు. మీ చిత్తశుద్ధి, నిజాయితీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. చిన్నతరహా పరిశ్రమల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు.
 
కన్య: ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్పురిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్, కోరుకున్నచోటికి బదిలీ వంటి శుభపరిణామాలున్నాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. స్త్రీలకు అయిన వారితో పట్టింపులెదురవుతాయి. పత్రికా, వార్తా సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. 
 
తుల: రేషన్ డీలర్లకు అధికారుల నుండి వేధింపులు తప్పవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సోదరీసోదరులతో ఏకీభవించలేకపోతారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యాపారాలు, సంస్థల్లో కొత్త భాగస్వాములను చేర్చుకునే విషయంలో పునరాలోచించండి.
 
వృశ్చికం: రాజీమార్గంలో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబీకులతో అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో ఏకాగ్రత వహించండి. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాలవారికి అన్ని విధాలా కలిసిరాగలదు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. 
 
ధనస్సు: ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఒకానొక విషయంలో బంధువుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో లౌక్యంగా మెలగండి. స్త్రీలు పట్టుదలతో శ్రమించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. 
 
మకరం: స్త్రీకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. ప్రత్యర్థులను సైతం మీ వైపునకు తిప్పుకుంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి పనివారలతో చికాకులు తప్పవు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయడం ఉత్తమం. 
 
కుంభం: వ్యాపార వర్గాల వారికి పెద్దమొత్తంలో చెక్కులిచ్చే విషయంలో పునరాలోచన మంచిది. సన్నిహితులతో ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతనవెంచర్లు ఏమంత సంతృప్తినీయవు. ఖర్చులు అధికమవుతాయి. గృహ వాస్తు దోష నివారణ వలన మంచి ఫలితాలు లభిస్తాయి. 
 
మీనం: సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు ఆర్జిస్తారు. రుణాలు తీరుస్తారు. ఉద్యోగ యత్నంలో దళారులను విశ్వసించకండి. రావలసిన ధనం అందడంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ప్రేమికుల విపరీత ధోరణి వలన సమస్యలెదురవుతాయి.