శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (09:44 IST)

07-04-2019 ఆదివారం దినఫలాలు... స్త్రీలకు విశ్రాంతి లోపం...

మేషం: స్త్రీలకు విశ్రాంతి లోపం, వేళతప్పి భోజనం వలన ఆరోగ్యం మందగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు చిరువ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. దైవ కార్యక్రమాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి విముక్తి లభిస్తుంది.
 
వృషభం: మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ఫలిస్తాయి. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం.
 
మిధునం: కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. రావలసిన ధనం వాయిదా పడుట వలన ఆందోళన చెందుతారు. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. రాజకీయనాయకులకు దూరప్రయాణాలలో మెళకువ అవసరం.
 
కర్కాటకం: ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. రుణాలు తీరుస్తారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. దైవ, సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి అధికమవుతుంది. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం.
 
సింహం: గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలుచేస్తారు. సభ, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. సోదరీసోదరులతో ఏకీభవించలేకపోతారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
కన్య: నిరుద్యోగులు లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరమని గమనించండి. భాగస్వామ్యుల మధ్య అవరోధాలు తలెత్తిన తెలివితో పరిష్కారిస్తారు. మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. రాజకీయ నాయకులకు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. 
 
తుల: స్త్రీలు విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. రుణాల కోసం అన్వేషిస్తారు. బంధుమిత్రులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. విద్యార్థులు క్రీడా రంగాలపట్ల ఆసక్తి చూపుతారు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొరవ ఉండదు. 
 
వృశ్చికం: రావలసిన ధనం రావడంతో మీ ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. శ్రీమతి సలహా పాటించడం చిన్నతంగా భావించకండి. ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు, ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
ధనస్సు: కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. హోటల్, తినుబండ, క్యాటరింగ్ పనివారలకు కలిసివచ్చే కాలం. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొరవ ఉండదు. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. 
 
మకరం: కానీ వేళ్ళల్లో ఇతరుల రాక ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు తల, కాళ్లు, నరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. విందు, వినోదాలలో పరిమితి పాటించడం మంచిది. ప్రేమికులకు పెద్దల నుండి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికం కాగలవు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత ముఖ్యం. 
 
కుంభం: నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. మిత్రుల కోసం బాగా ఖర్చుచేస్తారు. స్త్రీలకు బంధువులలో పేరు, ఖ్యాతి లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. విద్యుత్ రంగాలలో వారు మాటపడక తప్పదు. 
 
మీనం: స్త్రీలు షాపింగ్‌లో దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. కోపంతో పనులు చక్కబెట్టలేరు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. హోటలు తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.