03-04-2019 - బుధవారం మీ రాశిఫలితాలు

రామన్| Last Updated: బుధవారం, 3 ఏప్రియల్ 2019 (14:03 IST)
మేషం: ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు తల, కాళ్లు, నరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. సన్నిహితులతో మాటపట్టింపులను ఎదుర్కుంటారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. బంధువుల గురించి సహాయం లభిస్తుంది.

వృషభం: బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. కొత్తగా రుణాలు చేయవలసి వస్తుంది. కుటుంబీకులతో చికాకులు తలెత్తుతాయి. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. బంధువులలో గౌరవం లభిస్తుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు.

మిధునం: ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. కానీ వెళ్ళల్లో ఇతరుల రాక ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు బంధువులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి అధికమవుతుంది. రవాణా రంగాలవారికి చికాకులు అధికమవుతాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.

కర్కాటకం: విద్యుత్ రంగంలో వారు మాటపడక తప్పదు. మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల మనస్సులను బాధ పెట్టకండి. ఈ ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు వాయిదాపడుతాయి. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. భాగస్వామ్యుల మధ్య అవరోదాలు తలెత్తిన తెవిలితో పరిష్కరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి.

సింహం: ఎ.సి. కూలర్, ఇన్‌వైటర్ల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఖర్చులు అధికం. మీ పథకాలు, ఆలోచనలు కార్యరూపం దాల్చుతుంది. సోదరీసోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ప్రేమికులకు పెద్దల వలన సమస్యలు తలెత్తుతాయి. ఒక స్థిరాస్తి అమర్చుకునేందుకు తీవ్రంగా యత్నిస్తారు.

కన్య: ఆఫీసుల్లో తొందరపాటు నిర్ణాయాలతో కాక, మీ సీనియర్ల సలహాలను తీసుకుని ముందుకు సాగండి. రాజకీయ, కళారంగాల వారికి సన్మానం జరిగే అవకాశం ఉంది. అకాలభోజనం, శ్రమాధిక్యత వలన పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.

తుల: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు చికాకులు తప్పవు. ఆహార, ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్యలలో రాణిస్తారు. సాంఘిక, సంస్కృతి కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగుల నిర్లక్ష్యం వలన ఒక మంచి అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది.

వృశ్చికం: అక్రమ సంపాదనల వైపు దృష్టి సారించకపోవడం మంచిది. బిల్లులు చెల్లిస్తాయి. మీ సంతానం ఉన్నత చదువులకోసం దూరప్రయాణం చేయవలసి వస్తుంది. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. రుణ సమస్యల నుండి విముక్తులవుతారు. స్థిరచరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి.

ధనస్సు: ఉద్యోగస్తులు నిర్లక్ష్య ధోరణివలన, మతిమరుపు వలన అధికారులతో మాటపడక తప్పదు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదర ఉండదు. ఆలయాలను సందర్శిస్తారు. రావలసిన ధనం అందటంతో నిర్మాణ కార్యక్రమాలు చురుకుగా సాగుతాయి. స్త్రీలకు కొత్త వ్యాపకాలు, ఆలోచనలు స్పురిస్తాయి.

మకరం: ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వలన అనుకోని ఇబ్బందులు ఎదుర్కుంటారు. బంధువులను కలుసుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకం. దైవ కార్యాలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడం వలన మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం.

కుంభం: ధనం పొదుపు చేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. ఇంజనీరింగ్ రంగాల వారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి. రవాణా రంగాలలోని వారు చికాకులను ఎదుర్కుంటారు. దంపతుల మధ్య దాపరికం అనార్థాలకు దారితీస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాలు, ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.

మీనం: బంధువుల కారణాల వలన మీ కార్యక్రమాలు వాయిదా పడుతాయి. నేడు చేద్దామన్న పనులు రేపటికి వాయిదా వేస్తారు. పాత బాకీలు చెల్లిస్తారు. ముఖ్యమైన విషయాలను మీ శ్రీమతికి తెలియజేయడం ఉత్తమం. సోదరుల నుండి ఊహించని సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.దీనిపై మరింత చదవండి :