మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : బుధవారం, 29 మే 2019 (12:58 IST)

బుధవారం (29-05-2019) మీ రాశిఫలాలు - మీ సంతానం విద్యా విషయాలు...

మేషం: కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. అనుకోకుండా ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. బంధువుల రాకపోకలు చికాకుపరుస్తాయి. రాబడికి మించిన ఖర్చులు, అనుకోని చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. స్త్రీల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. మీ సంతానం విద్య, విషయాల పట్ల దృష్టి సారిస్తారు.
 
వృషభం: సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. విద్యార్థులకు క్రీడలు, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సోదరుల మధ్య ఆస్తి పంపకాల వ్యవహారాల ప్రస్తావన వస్తుంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానం అందుకుంటారు. లీజు, ఏజెన్సీలు, టెండర్ల వ్యవహారాల్లో పునరాలోచన అవసరం.
 
మిథునం: వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు అన్ని విధాల కలిసిరాగలదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. కొన్ని విషయాల్లో మీ అంచనాలు, ఊహలు తారుమారుతాయి. ప్రేమికులు అతిగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. ఉద్యోగస్తులకు తోటివారి వల్ల ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి.
 
కర్కాటం: దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు, చికాకులు చోటుచేసుకుంటాయి. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. కుటుంబీకుల మధ్య బంధువుల ప్రస్తావన వస్తుంది. ఎంతటివారైనా మీ వాగ్ధాటితో మెప్పిస్తారు. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. ఖర్చులు అదుపు చేయాలనే సంకల్పం నెరవేరదు.
 
సింహం: అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ప్రేమికులకు ఓర్పు, సమయస్ఫూర్తి బాగా అవసరం. నూతన వ్యాపారాలు, వ్యాపారాల విస్తరణలకు కావలసిన అనుమతులు, వనరులు సమకూర్చుకుంటారు. దైవ, సేవ పుణ్య కార్యాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. స్త్రీలకు సెంటిమెంట్లు, శకునాల ప్రభావం అధికం.
 
కన్య: చెప్పుడు మాటలు మనస్తాపం కలిగిస్తాయి. ప్రైవేట్ చిట్స్ నిర్వాహకులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. వేడుకలు, శుభకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మీరందిన కానుకలు ఎదుటివారిని సంతృప్తిపరుస్తాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.
 
తుల: వాహనచోదకులకు ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. కార్యసిద్ధి, వృత్తి వ్యాపారాల్లో అనుకూలత వంటి శుభపరిణామాలు వుంటాయి. అనుకున్న పనులు పట్టుదలతో శ్రమించి పూర్తి చేస్తారు. నిత్యావసర వస్తు, వ్యాపారస్తులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. అవివాహితులకు కోరుకున్న సంబంధాలు నిశ్చయం కాగలవు.
 
వృశ్చికం: ఇతరుల విషయాలకు, వాగ్వివాదాలకు దూరంగా వుండటం మంచిది. స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెళకువ అవసరం. ఉద్యోగస్తులు ఓర్పు, అంకితభావంతో పనిచేసి అధికారులను మెప్పిస్తారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. విద్యార్థుల్లో ఆందోళన తొలగి మనోధైర్యం నెలకొంటుంది.
 
ధనస్సు: వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు శుభదాయకం. ఖర్చులు అధికంగా వున్నా ఇబ్బందులుండవు. మార్కెటింగ్ రంగాల వారికి, ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది.
 
మకరం: ఆర్థిక విషయాల్లో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు, సంతృప్తి నివ్వగలవు. పాత మిత్రుల కలయికతో కొత్త అనుభూతి పొందుతారు. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది.
 
కుంభం: స్థిరాస్తి విక్రయించాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వుంటాయి. వృత్తి వ్యాపారాల్లో కొత్త వ్యూహాల అమలుకు అనుకూలమైన రోజు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ కుటుంబానికి మీరు అవసరం కాబట్టి వ్యసనాలకు దూరంగా ఉండండి.
 
మీనం: సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. మీ ఉత్సాహాన్ని అదుపులో వుంచుకోవడం శ్రేయస్కరం. మీ ఉత్సాహాన్ని అదుపులో వుంచుకోవడం శ్రేయస్కరం. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు.