శనివారం (25-05-2019) మీ రాశిఫలాలు - మీ అలవాట్లు.. బలహీనతలు...

Last Updated: శనివారం, 25 మే 2019 (06:08 IST)
మేషం : విద్యార్థినులలో ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. ప్రయాణాలు, తీర్థయాత్రలలో అసౌకర్యానికి గురవుతారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. వస్త్ర, బంగారం, పచారీ, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. రుణయత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు.

వృషభం : మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది. స్త్రీలకు పుట్టింటి నుంచి శుభవార్తలు అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వృత్తుల వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం.

మిథునం : వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. సంతానం, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల ఇబ్బందులెదుర్కొంటారు.

కర్కాటకం : ఆర్థిక సంస్థల నుంచి నిధులు మంజూరవుతాయి. వనసమారాధనలు, దైవదీక్షల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యం. ఇతరులను సాయం చేసి ఆదుకోవాలనే తలంపుతో చిక్కులు కొనితెచ్చుకునే ప్రమాదం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

సింహం : వృత్తిరీత్యా ప్రయాణాలు, చికాకులు ఎదుర్కొంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. శ్రీమతి సలహా పాటించడం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. దైవ దర్శనాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఏజెంట్లు, బ్రోకర్లకు సామాన్యం.

కన్య : రుణవిముక్తులు కావటంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం మంచిది కాదు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం.

తుల : నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఏ విషయంలోను మీ శ్రీమతికి ఎదురు చెప్పటం మంచిది కాదు. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, హోటల్, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు అధికం.

వృశ్చికం : వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలీయమవుతుంది. సహోద్యోగులతో సఖ్యత లోపిస్తుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని చేపట్టిన పనులు పూర్తి కావు. ప్రేమికులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనస్సు : కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. మిత్రుల ప్రోత్సాహంతో దైవదీక్షలు స్వీకరిస్తారు. అసాధ్యమనుకున్న దానిని సాధించి మీ సత్తా చాటుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ప్రముఖుల కలయిక వల్ల మీ సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

మకరం : రాబోయే ధనానికి ముందుగానే ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఏ విషయంలోను ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. స్త్రీలకు నరాలు, దంతాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. వ్యాపార లావాదేవీల్లో స్వల్ప ఆటుపోట్లు, చికాకులు తప్పవు.

కుంభం : బ్యాంకు ఉద్యోగులు విధినిర్వహణలో అలసత్వంతో ప్రమాదంలో పడే సూచనలున్నాయి. స్త్రీలు శుభకార్యాలలో కలుపుగోలుగా వ్యవహరించి అందరిని ఆకట్టుకుంటారు. విద్యార్థినులు భయాం దోళనలువిడనాడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. విద్యార్ధినులు భయాం దోళనలు విడనాడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి.

మీనం : ఖర్చులు అధికంగా ఉన్నా ధనానికి కొదువ ఉండదు. మీ శ్రీమతి ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే గాని పనులు పూర్తికావు. నిరుద్యోగులకు సదవకాశాలు లభించిన తొందరపాటుతనంతో జార విడుచుకుంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు కలిసివస్తాయి.దీనిపై మరింత చదవండి :