సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 27 మే 2019 (10:53 IST)

సోమవారం (27-05-2019) మీ రాశిఫలాలు - చేపట్టిన పనులు...

మేషం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. దైవ దర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పాత బాకీలు తీరుస్తారు.
 
వృషభం: ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. సభ, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. రాబడికి మంచి ఖర్చులు అధికమవడం వల్ల ఆందోళన అధికమవుతుంది. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. నిరుద్యోగులకు ఆశాజనకం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
మిథునం: హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు అనుకూలిస్తాయి. ఉద్యోగులు పై అధికారులతో మాటపడవలసివస్తుంది. వృత్తి వ్యాపారులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
కర్కాటకం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రయత్నం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు.
 
సింహం: మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. ఆకస్మిక ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. దంపతులకు ఏ విషయంలో పొత్తు కుదరదు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.
 
ఉపాధ్యాయులకు విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. స్త్రీలు తెలియని అశాంతికి గురవుతారు. భాగస్వామ్యుల మధ్య విభేదాలు సృష్టించేవారు అధికం అవుతున్నారని గమనించండి.
 
తుల: కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఏమాత్రం పొదుపు సాధ్యం కాదు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి.
 
వృశ్చికం: వృత్తిపరంగా ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు. పెరిగిన ధరలు, కుటుంబ ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఖర్చులు పెరిగినా ఆర్థిక లోటుండదు. రహస్య విరోధులు అధిక కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. కపటం లేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది.
 
ధనస్సు: పత్రికా సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. షాపు గుమస్తాలతో చికాకులు, వినియోగదారులతో మాటపడవలసి వస్తుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి వుండాల్సి వస్తుంది. అప్రయత్నంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి.
 
మకరం: షాపు గుమస్తాలతో చికాకులు, వినియోగదారులతో మాటపడవలసి వస్తుంది. అదనపు రాబడి మార్గాలు అన్వేషిస్తారు. స్త్రీలకు ఆడంబరాలు, అలంకారాల పట్ల మక్కువ పెరుగుతుంది. మీ సంతానం పై చదువుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. కొత్త బాధ్యతలు, స్థానచలన ప్రదేశం ఉద్యోగస్తులకు చికాకు కలిగిస్తుంది.
 
కుంభం: ఇసుక, క్వారీ, ఆక్వా రంగాల వారికి అభ్యంతరాలెదుర్కొంటారు. అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తారు. మీ పనులు చక్కబెట్టుకుంటారు. ప్రయాణం వాయిదా వేసుకోవడం ఉత్తమం. మీ సంతానం పై చదువుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది.
 
మీనం: స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. ధనం చెల్లింపులు, ఇచ్చి పుచ్చుకునే విషయంలో సరిచూసుకోండి. పెద్దల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. చిన్న పరిశ్రమల వారికి గడ్డుకాలం. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ప్రేమికులు చిక్కుల్లో పడే ఆస్కారం వుంది.