మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలోనే పెంచాలట.. మట్టిలో కానీ, నీటిలో కానీ?

Last Updated: మంగళవారం, 28 మే 2019 (12:57 IST)
సాధారణంగా ఇంట్లో మనీ ప్లాంట్‌ను పెంచడం ద్వారా ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయని, సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. అంతేగాకుండా మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచడం ద్వారా ఆర్థిక సమస్యలుండవ్. రుణబాధలు తీరిపోతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. అలాంటి మనీ ప్లాంట్‌ను ఎలా పెంచాలంటే.. ఇంట్లో మనీ ప్లాంట్‌ను పెంచే దిశను ఎంచుకోవడం అధిక శ్రద్ధ తీసుకోవాలి. 
 
ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్‌ను పెంచడం చేయాలి. ఆగ్నేయ దిశలోనే పాజిటివ్ ఎనర్జీ నిక్షిప్తమై వుంటుందట. అందుకే ఈ దిశలో మనీ ప్లాంట్‌ను పెంచాలని.. అప్పుడే సానుకూల ఫలితాలు వుంటాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. 
 
అంతేగాకుండా ఆగ్నేయం విఘ్నేశ్వరుని దిశగా పేరొందింది. ఈ దిశకు వినాయకుడు అధిపతి. ఇంకా ఈ దిశకు శుక్రుడు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఈ కారణాల చేత మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో పెంచాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇంకా మనీ ప్లాంట్‌ను మట్టిలో వుంచే పెంచాలి. ఇంకా నీటి డబ్బాల్లో వుంచి పెంచవచ్చు. ఇంటిలోపల కానీ, బయట కానీ మనీ ప్లాంట్‌ను పెంచడం చేయొచ్చు. దీనివల్ల ఇంట్లో సంపదకు లోటుండదు. మనీ ప్లాంట్‌లో ఆకులు వాడితే వెంటనే వాటిని తొలగించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :