Satyanarayan Puja: సత్యనారాయణ వ్రతానికి కీలకమైన రోజు... శనివారం పౌర్ణమి..
Satyanarayan Puja
ఇది సత్యనారాయణుని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఐదు అధ్యాయాల కథ. ఉపవాసం చేస్తున్న కుటుంబాలు దీనిని వినడానికి సమావేశమవుతారు. చివరగా పంచామృతాన్ని (పాలు, పెరుగు, తేనె, నెయ్యి మరియు పంచదార మిశ్రమం) ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ రోజున ఉపవాసం ద్వారా పౌర్ణమి వ్రతాన్ని పాటించే వారుంటారు. పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే లేచి, తలస్నానం చేసి శుచిగా ఉండాలి.
గణపతి పూజ: ముందుగా పసుపుతో వినాయకుడిని (అంగుళం సైజులో త్రికోణ ఆకారంలో) చేసి తమలపాకుపై ప్రతిష్టించి పూజించాలి. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం ముందు పసుపు గణపతికి పూజ చేయాలి. దానికి కుంకుమ బొట్టు పెట్టి, తర్వాత ఒక పళ్లెంలోగాని,. కొత్త వస్త్రం మీద పెట్టి, బియ్యం పోసి దానిపై ఒక తమలపాకులో ఆ పసుపు గణపతిని ప్రతిష్టించాలి. అగరువత్తులు వెలిగించాలి. ఆపై పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి. దీపారాధన నైరుతి దిశలో చేయాలి.
కలశ స్థాపన: నవగ్రహ మండపం ఏర్పాటు చేసి, సత్యనారాయణ స్వామిని విగ్రహం లేదా చిత్రపటం ద్వారా ఆవాహన చేయాలి. కథా శ్రవణం: పూజ ముగిసిన తరువాత సత్యనారాయణ స్వామి వ్రత కథలను చదివి, హారతి ఇవ్వాలి. ప్రసాదం: అరటిపండ్లు, రవ్వ (కేసరి), పంచదార, ఆవుపాలతో చేసిన ప్రసాదాన్ని స్వామికి నివేదించి భక్తులకు పంచాలి. సత్యనారాయణ వ్రత కల్పం చెప్పుకోవాలి. ఇంకా సత్యనారాయణ స్వామి అష్టోత్తర శతనామావళిని పఠించాలి.
