1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Triveni yoga in Astrology

మౌని అమావాస్య వేళ త్రివేణి యోగం.. ఈ మూడు రాశులకు లాభాలు

Astrology
జనవరి 29న బుధవారం నాడు మౌని అమావాస్య వచ్చింది. మౌని అమావాస్య వేళ అరుదైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి. మకరంలో త్రివేణి యోగం ఏర్పడనుంది. సూర్యుడు, చంద్రుడు, బుధుడు ఇదే రాశిలో కలిసి ఉండటం వల్ల త్రిగ్రహం ఏర్పడనుంది. 
 
మరోవైపు గురుడు తొమ్మిదో స్థానం నుంచి ఈ మూడు గ్రహాలను చూడనున్నాడు. దీంతో నవ పంచమ యోగం ఏర్పడనుంది. అంతేకాదు సిద్ధి యోగం కూడా బుధవారం రాత్రి 9:22 గంటల వరకు ఉంటుంది. ఈ శుభ యోగాల వల్ల కర్కాటకం, కన్య సహా ఈ 4 రాశులకు ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. 
 
ఈ యోగం కారణంగా కన్యారాశి జాతకులకు సర్వశుభాలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మీరు సంతానం గురించి శుభవార్తలు వింటారు. సంతానప్రాప్తి, వివాహయోగం వుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు కలిసొచ్చేకాలం. కర్కాటక రాశి నుంచి ఏడోస్థానంలో త్రివేణి యోగం ఏర్పడనుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అన్నీ కార్యాల్లో విజయం వరిస్తుంది. 
 
అలాగే మకర రాశిలో త్రివేణి యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో మకర రాశి వారికి అపారమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. జీవితం సుఖమయం అవుతుంది. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ కాలంలో వ్యాపారులకు కలిసొస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
30-01-2025 గురువారం దినఫలితాలు : ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...