1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
  4. Dakshinavarta Shankham Significance, Benefits and Rituals

శంఖాన్ని ఇంటి గుమ్మం దగ్గర ఉంచితే... వాస్తు దోషం మటాష్... శుక్రవారం ఇలా..?

Dakshinavarta Shankham
Dakshinavarta Shankham
శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠలకు, శ్రీలక్ష్మి ఆగమనానికి ప్రతీక. దీనిని పూజించటం వల్ల వాస్తుదోషాలుపోతాయి. వాస్తుదోషం పోవడానికి ఎర్ర ఆవు పాలతో దానిని నింపి ఇల్లు అంతా చల్లుతారు. ఇంటి సభ్యులు అంతా సేవిస్తారు. ఇలా చేయడం వల్ల రోగాలు, దు:ఖాలు, దౌర్భాగ్యం దూరమవుతాయి అంటారు. శంఖాన్ని ఇంట్లో ఉంచితే వాస్తు దోషం తొలగిపోతుంది. 
 
శంఖాన్ని ఇంటి గుమ్మం దగ్గర ఉంచితే ఎలాంటి ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదని విశ్వసిస్తారు. అందులోనూ దక్షిణావృత శంఖంను ఇంటి గుమ్మం వద్ద ప్రతిష్టించినట్లైతే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ముమ్మూర్తులలో ఈ ప్రపంచాన్ని కాపాడే దేవుడిగా విరాజిల్లేవారు మహా విష్ణువు అంశంగా విరాజిల్లేది దక్షిణావృత శంఖం. ఈ దక్షిణావృత శంఖం ఐశ్వర్య లక్ష్మి అంశంగా భావించబడుతోంది. దీనిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద శంఖాన్ని ప్రతిష్టించడం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయి. 
 
మన పూర్వీకులు ఒక ఇల్లు కట్టేటప్పుడు దాని ప్రధాన ద్వారం వద్ద శంఖాన్ని ప్రతిష్టించే ఆచారాన్ని కలిగి ఉన్నారు. కానీ ప్రస్తుతం దక్షిణావృత శంఖాన్ని ప్రతిష్టించడాన్ని మరచిపోతున్నారు.
 
ఇంటి గుమ్మం వద్ద దక్షిణావృత శంఖాన్ని ప్రతిష్టించడం వలన, ఇంటి పూజా గదిలో దక్షిణావృత శంఖాన్ని ఉంచి పూజించడం వలన దైవిక శక్తి పెరుగుతుంది. ఇంటి ద్వారం వద్ద శంఖాన్ని ప్రతిష్టించేటప్పుడు దుష్ట శక్తులు లోపలికి రావు. దిష్టి దోషం కలగదు. దీని వలన ఆ ఇంట్లో ఉన్నవారికి దిష్టికి సంబంధించిన ఇబ్బందులు కలగకుండా నివారించబడుతుంది. ఇంట్లో దక్షిణావృత శంఖాన్ని ఉంచి పూజించడం వలన సంపద వృద్ధి చెందుతుంది.
 
ప్రతి శుక్రవారం శంఖు పూజ చేయడం మంచిది. ఒక అరటి ఆకులో బియ్యాన్ని పరచి దానిపై శంఖాన్ని ఉంచండి. దానికి గంధం, కుంకుమ, పూలతో అలంకరణ చేయండి. తరువాత లక్ష్మీదేవిని కొలువుదీరమని ప్రార్థించి లక్ష్మీ అష్టోత్తరం లేదా లక్ష్మీదేవికి సంబంధించిన స్తుతి పాటను పాడవచ్చు. దీని ద్వారా మీ ఇంట్లో దిష్టి దోషం తొలగిపోవడమే కాకుండా, ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
11-11-2026 బుధవారం నాటి రాశి ఫలితాలు.. సహచరులతో సమన్వయం పాటిస్తే?