Sashti Viratham 2026: స్కంధ షష్ఠి వ్రతం ప్రారంభం.. ఆరు రోజులు ఉపవాసం వుంటే... ఫలితం ఏంటి?
Kanda Sashti Viratham 2026
ఈ వ్రతాన్ని అందరూ పాటిస్తారు. విద్యార్థుల కోసం, వివాహితులు సంతానం కోసం, అవివాహితులు వివాహం కోసం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని మరికొందరు వారి వారి కోరికలు నశింప జేయాలని సంకల్పించుకుని వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించే వారు వారి వారి ఆరోగ్య పరిస్థితిని అనుసరించి ఆరో రోజులు ఒక్క పూట ఆహారం వీడి లేదంటే మిరియాలు, నీరు, పండ్లు, పాలు తీసుకుంటూ ఉపవాసం వుంటారు. ఆరో రోజు సూర పద్ముని సంహారం, తిరు కళ్యాణం తర్వాత ఉపవాసం వీడుతారు.
ఈ వ్రత సమయంలో, ప్రతిరోజూ స్కంధ షష్ఠి కవచం, స్కంధ పురాణం వంటివి పారాయణం చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. షష్ఠి వ్రతంలోని ఆరు రోజులు కందస్వామి ఆలయంలో జరిగే పూర్ణకుంభ విశేష అభిషేకం, షణ్ముఖార్చన, కంద పురాణ పారాయణం జరుగుతాయి.
వ్రతం ముగిసే రోజున మురుగన్ ఆలయంలో సూరసంహారం జరుగుతుంది. మరుసటి రోజు వ్రతం ఆచరించిన వారందరూ వ్రతాన్ని ముగిస్తారు. పారణ రోజున ఆరుగురికి అన్నదానం చేసి భోజనం చేయాలి. ఇలా వ్రతాన్ని పాటించడం వల్ల కుమార స్వామి అనుగ్రహంతో కోరిన వరాలన్నీ లభిస్తాయని, అన్ని శుభాలు జరుగుతాయని విశ్వాసం.

