సంబంధిత వార్తలు
- Magha Purnima 2025 : మాఘ పూర్ణిమ రోజున సాయంత్రం ఇలా చేస్తే?
- ప్రదోష కాలంలో తులసి, కొబ్బరి నీళ్లు శివునికి ఇవ్వకూడదట!
- Madhva Navami 2025: మధ్వ నవిమి రోజున నేతి దీపం వెలిగించి.. మధ్వాచార్యులను స్తుతిస్తే?
- Bhishma Ashtami 2025: శ్రీకృష్ణుడిపై భక్తి.. అంపశయ్యపై దాదాపు 58 రోజులు
- 05th February 2025: భీష్మాష్టమి, బుధాష్టమి.. దీపారాధనకు తామరవత్తులు.. ఇవి చేస్తే?
Phalgun Month 2025: ఫాల్గుణ మాసం వచ్చేస్తోంది.. చంద్రుడిని ఆరాధిస్తే.. పండుగల సంగతేంటి?
Moon Puja
ఫాల్గుణ మాస సమయంలో చంద్రుడిని పూజించడం వల్ల చంద్ర దోషం తొలగిపోతుందని విశ్వాసం. పురాణాల ప్రకారం, చంద్రుడు ఈ నెలలో జన్మించాడు. అందుకే చంద్రునికి ప్రార్థనలు చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఫాల్గుణ మాసమంతా ఉదయాన్నే నిద్రలేచి, సూర్యోదయానికి ముందు స్నానం చేయడం సూర్యుడిని ఉదయం పూట.. సాయంత్రం పూట చంద్రుడిని పూజించడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది. ఆయురారోగ్యాలు చేకూరుతాయి. మాఘ మాసంలో శుభ్రమైన, కొత్త తెల్లని బట్టలు ధరించి, దేవతలకు పూజలు చేయాలి.
అలాగే ఫాల్గుణ శుక్ల అష్టమి నాడు, లక్ష్మీదేవిని, సీతను పూజించే సంప్రదాయం ఉంది. ఫాల్గుణ చతుర్దశి రోజున శ్రీకృష్ణుడు, శివుడిని పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఫాల్గుణ మాసంలో హోలీ, మహా శివరాత్రి, విజయ ఏకాదశి, యశోద జన్మోత్సవం, జానకి జన్మోత్సవం, అమలకి ఏకాదశి వంటి అనేక పండుగలు జరుగుతాయి.
