1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. Spiritual meaning eating food in dream

కలలో ఏమైనా తింటున్నట్లు చూస్తే.. పండ్ల రసం తాగినట్లు కలగంటే?

Food in dream
Food in dream
మీకు వచ్చిన కల గురించి చాలా సార్లు ఆలోచించి ఉంటారు. కొన్ని కలలు ఆహ్లాదకరంగా ఉంటాయి లేదా మన మనసును కలవరపెట్టేలా ఉంటాయి. కలల గురించి, మనం కనే కలలో వచ్చే విషయాల ఆధారంగా ఎలాంటి ఫలితాలు లభిస్తాయనేది స్వప్న శాస్త్రంలో వివరించబడింది. 
 
మన కలలో తినడం లాగా లేదా ఏదైనా పండ్ల రసం వంటివి తాగడం లాగా చూసి ఉంటాము. ఇలాంటి కలలను సరదాగా పట్టించుకోకుండా వదిలేస్తాం, కానీ, అలాంటి కలలు మీరు ధనవంతులుగా మారడాన్ని సూచిస్తాయని మీకు తెలుసా? కాబట్టి కలలో ఆహార పదార్థాలను చూడటం అర్థం ఏమిటో చూద్దాం.
 
కలలో ఉసిరికాయ తిన్నట్లు కనిపిస్తే :
 
స్వప్న శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి కలలో ఉసిరికాయ తిన్నట్లు చూస్తే, మీ సంపదను సంపాదించడానికి సంబంధించిన కోరిక నెరవేరబోతోందని అర్థం. అంటే, మీరు డబ్బు సంపాదించే అవకాశం పెరుగుతుంది. ఈ కల కారణంగా మీ నెరవేరని కొన్ని కోరికలు త్వరలో నెరవేరుతాయని సూచిస్తుంది. 
 
కలలో అల్లం తినడం చూస్తే 
అల్లం ఆహారం, టీ రుచిని పెంచడమే కాకుండా, మీకు ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుంది. మీరు అల్లం తిన్నట్లు కలగంటే, మీ విలువ మరియు గౌరవం పెరుగుతుందని అర్థం. 
 
కలలో పైనాపిల్ తినడం చూస్తే..
స్వప్న శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి కలలో పైనాపిల్ తినడం చూస్తే, పైనాపిల్ లాగానే బయట ముళ్లలా ఉన్నట్లు మొదట మీరు కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది, ఆ తర్వాత దాని లోపల ఉన్న తీపి పండు లాగా మీరు అపారమైన సంపదను పొందుతారని అర్థం.
 
ఐస్ క్రీమ్, వాల్ నట్స్ తినడం.. 
కల అనేది దానికి ఎలాంటి పరిమితి లేదు. ఏదైనా కలలో రావచ్చు. ఆ విధంగా మీ కలలో ఐస్ క్రీమ్ తినడం చూస్తే, మీ జీవితంలో సంతోషకరమైన, మనసుకు చల్లదనాన్ని ఇచ్చే ఆహ్లాదకరమైన విషయాలు జరుగుతాయి. అదేవిధంగా వాల్ నట్స్ తినడం కలలో చూస్తే మీ జీవితంలో సంతోషం రాబోతోందని అర్థం. ఆకస్మికంగా సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది.
 
మామిడి పండు తినే కల... మీరు మామిడి పండు రుచి చూస్తున్నట్లు కలగంటే మీకు అపారమైన సంపద లభించబోతోందని అర్థం. అలాంటి కలలు మీ అదృష్టాన్ని ప్రకాశింపజేస్తాయి.
 
కలలో చింతపండు తినడం... చింతపండు తినడం కలలో చూస్తే అది మంచి సంకేతం. అయినప్పటికీ, ఇలాంటి కలలు మహిళలకు మాత్రమే శుభప్రదంగా పరిగణించబడతాయి. అదే సమయంలో పురుషులకు అశుభంగా పరిగణించబడతాయి. స్వప్న శాస్త్రం ప్రకారం, ఒక మహిళకు ఇలాంటి కలలు ఆర్థికంగా పురోగతిని కలిగిస్తాయి.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
24-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు - మాటల్లో సంయమనం పాటించడం మంచిది..