1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. Today's Religion Special

వృషభ లగ్నంలో పుట్టిన జాతకులైతే..?

navaratnalu
మేష లగ్నంలో పుట్టిన జాతకులు పగడం, కెంపు, కనకపుష్యరాగమును ధరించడం శుభప్రదమని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీనిని ధరించడం వలన ఆయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. 
 
ఇదే జాతకులు కెంపు రత్నాన్ని ధరించడం ద్వారా పుత్రప్రాప్తి, గౌరవం వంటి శుభఫలితాలున్నాయి. ఇక మేషలగ్నంలో పుట్టిన జాతకులు కనక పుష్యరాగాన్ని ధరించడం ద్వారా అదృష్టం వెన్నంటి వుంటుంది. అలాగే కుటుంబానికి లాభం చేకూరుతుంది. 
 
ఇక వృషభలగ్నంలో పుట్టిన జాతకులైతే.. వజ్రమును ధరించడం ద్వారా రుణభారము తొలగిపోతుంది. శత్రుబాధల్ని తగ్గించి ధనలాభము కలుగుతుంది. అలాగే ఈ జాతకులు నీలమును ధరించడం ద్వారా ధన భాగ్యము చేకూరుతుంది. శారీరక తేజస్సు పెరిగి ముఖవర్చస్సు పెరుగును. అదృష్టముతో పాటు ఉద్యోగము వచ్చును. ఉద్యోగములో ఉన్నత స్థానమును అలంకరిస్తారు. 
 
వృషభ లగ్నంలో జన్మించిన జాతకులు జాతిపచ్చను ధరించడం ద్వారా విద్యాభివృద్ధి కలిగి జ్ఞాపకశక్తి పెరుగును. ప్రతిభతో పరీక్షల్లో విజయం లభించును. సంతానం, ధనలాభము కలుగుతుందని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
తర్వాతి కథనం
24-02-2019 నుంచి 01-03-2019 వరకూ రాశి ఫలితాలు.. ముఖ్యమైన పనులకు..(Video)