మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (12:16 IST)

టాయిలెట్స్ పక్కన గృహ నిర్మాణాలు చేస్తున్నారా..?

నేటి తరుణంలో చాలామంది ఇంట్లోనే టాయిలెట్స్ పెట్టి కట్టుకుంటున్నారు. మరికొందరైతే ఏకంగా టాయిలెట్స్ పక్కనే గృహ నిర్మాణాలు చేస్తున్నారు. ఇలా చేయడం మంచిదో కాదో తెలియక సతమతమవుతున్నారు. అలాంటప్పుడు వాస్తుప్రకారం ఇలా చేస్తే చాలంటున్నారు పండితులు. కొత్తగా కట్టే అనేక అపార్టుమెంట్‌లలో చాలామంది నిర్మాణ దారులు ఉత్తరంలో తూర్పులో టాయిలెట్లు పెడుతున్నారు.
 
తూర్పు ఉత్తరాలు సూర్యుని ఉషోదయ కిరణాలు గృహంలోకి వచ్చే దిశలు. వాటిని స్వీకరించే స్థలాలు మరుగు, మురుగు దొడ్లు అయినప్పుడు వాటిగుండా ప్రయాణించే సూర్యుని కిరణాలు, గాలి, మలినాలతో సూక్ష్మక్రిములతో నిండి ఇంటిని ఆక్రమిస్తుంది.
 
కాబట్టి గొప్ప అందమైన గృహాలు అలాంటి వాటితో ఆరోగ్యహీనంగా మారిపోతున్నాయి. ప్లోరింగ్, ఎలివేషన్లకు ఇచ్చిన ప్రాధాన్యం ఇంటి ఆరోగ్య వాతావరణం, వైభవాలకు ఇవ్వనప్పుడు ఇంటి గొప్పతనంతో ఏం ఉపయోగం ఉంటుంది. కనుక టాయిలెట్ మార్చండి.. అలాకాకుంటే ఆ ఇల్లు కొనకండి.