శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (15:04 IST)

సింహ ద్వారం ఎటువైపు ఉండాలంటే..?

ఇంటికి పెట్టే ద్వారాల్లో ప్రధానమైంది సింహ ద్వారం అత్యంత కీలకమైంది. ఈ ద్వారం ఎటువైపు ఉండాలన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. వాస్తు ప్రకారం సింహద్వారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. సింహద్వారం సరైన దిశలో అమరితే.. సగం వాస్తు కుదిరనట్టే. 
 
సింహ ద్వార గృహం ఏదైనప్పటికీ రహదారి ఉన్న వైపునకు ఉన్న దిశలో స్థలానికి ఉచ్ఛ స్థానంలో ప్రహరీ గేటును పెట్టుకుంటే మంచిదంటున్నారు. తూర్పు స్థలంలో నిర్మించిన గృహంలో తూర్పు ఈశాన్యం లేదా తూర్పు ఉచ్ఛంలో గేటు ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. 
 
అలాగే, విశాలమైన స్థలం కలిగి రెండుగేట్లు పెట్టదలచినవారు.. దక్షిణ ఆగ్నేయంలో పెద్ద గేటు, దక్షిణ ఉచ్ఛంలో చిన్న గేటు పెట్టుకుంటే మంచిదంటున్నారు. దక్షిణం ఉచ్ఛం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు, పశ్చిమ ఉచ్ఛం నుంచి పశ్చిమ వాయువ్యంలో గేటు పెట్టాలి. దక్షిణంలో అయితే దక్షిణ ఆగ్నేయంలో పెద్ద గేటు, దక్షిణంలో చిన్న గేటు పెట్టాలి.
 
ఆగ్నేయ స్థలంలో తూర్పు సింహద్వార గృహం కట్టడం శ్రేయస్కరం. కాబట్టి ప్రహరీ గేట్లు కూడా తూర్పు ఈశాన్యం, తూర్పు ఉచ్ఛంలో పెట్టుకోవడం మంచిదని, దక్షిణ స్థలంలో గేటు దక్షిణ స్థలంలో నిర్మించిన గృహంలో దక్షిణం ఉచ్ఛం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు ఉన్న స్థలంలో సింహద్వారం ఎదురుగా గేటు పెట్టుకుంటే మంచిదని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.