1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. cameras ban in Sri Kalahasti Temple

శ్రీకాళహస్తీశ్వరాలయంలో కెమెరాలు నిషేధం

cameras ban
చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన వాయులింగేశ్వర క్షేత్రంలో కెమెరాలను నిషేధిస్తూ దేవదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆలయంలోపలకు వెళ్ళే విఐపిలతో పాటు పాత్రికేయులు ఎవరూ కూడా కెమెరాలను తీసుకెళ్ళకూడదని దేవదాయశాఖ జిఓను విడుదల చేసింది. 
 
ఆలయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవదాయశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కెమెరాలతో పాటు చరవాణిలను కూడా శ్రీకాళహస్తీశ్వరాలయంలోకి అనుమతించరని ఈ జీవోలో పేర్కొంది. దీంతో భద్రతా అధికారులు మరింత అప్రమత్తమై భక్తులను నిశితంగా తనిఖీ చేయనున్నారు.