కనకదుర్గమ్మకు రూ.75లక్షల బంగారు కిరీటం.. ఎస్వీ గో-సంరక్షణ కేంద్రానికి ఐదు గోవులు
Durga
ఆలయ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి.కె. సీనా నాయక్, దసరా ఉత్సవాల ప్రధాన అధికారి వి. త్రినాథ్ రావు కలిసి ఈ కానుకను స్వీకరించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజున, అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
మరోవైపు ఎస్వీ గోసంరక్షణ శాలకు ఐదు దేశీ ఆవులను విరాళంగా అందించారు టీటీడీ ఉన్నతాధికారి. టీటీడీ అదనపు కార్యనిర్వాహక అధికారి (ఈవో) సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఎస్.వి. గోసంరక్షణ శాలకు ఐదు దేశీయ ఆవులను విరాళంగా ఇచ్చారు. సనాతన ధర్మంలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్న ఆయన, గోసంరక్షణకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.
ఈ విషయాన్ని టీటీడీ బుధవారం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. గోవుల రక్షణ కోసం, అలాగే వాటి ఆధ్యాత్మిక, ఆర్థిక ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు ఎస్.వి. గోసంరక్షణ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ ట్రస్ట్‌కు అందే ప్రతి విరాళానికి సమానమైన మొత్తాన్ని టీటీడీ కూడా జత చేస్తుంది. తద్వారా ఈ సంస్థ స్వయం సమృద్ధిని సాధించేలా కృషి చేస్తోంది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి టీటీడీ అధికారిక నిర్వాహక సంస్థగా వ్యవహరిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన హిందూ పుణ్యక్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.

