1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. tirupati sri kodandarama swamy temple

వైభవంగా కోదండరామస్వామి రథోత్సవం

tirupati sri kodandarama swamy temple
తిరుపతిలో వెలసిన కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం కన్నులపండువగా జరిగింది. రథంపై స్వామి, అమ్మవార్లు చిద్విలాసం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. నాలుగు మాడా వీధుల్లో స్వామివారి రథాన్ని భక్తులు లాగారు. 
 
అంతకుమందు కోదండరాముడిని, సీతాదేవిని సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన తితిదే వేదపండితులు వజ్రవైఢ్యూర్యాలను అలంకరించి రథంపై అధిష్టింపజేశారు. అనంతరం రథోత్సవ ఘట్టాన్ని పూర్తి చేశారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.