Entertainment | Satire | CM | YS | Homur | అబ్బా... ఎప్పుడూ అదే మాటేనా... ?
|
చెవాకు : అయ్యా వైఎస్ గారూ... మీ ఏ విషయమైనా అద్భుతంగా చెబుతారండి. ఓపక్క తెలంగాణకు అభ్యంతరం లేదంటారు. మరోపక్క ఇప్పట్లో తెలంగాణ రాదంటారు. కాదంటే తెలంగాణ సమస్యపై సమగ్ర అధ్యయనం కోసం కమిటీ వేశాం కదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కేస్తారు.
అసలింతకీ తెలంగాణ ఇవ్వాలని మీ పార్టీ అంత గట్టిగా అనుకుని ఉంటే ఆ వేసే కమిటీ ఏదో గత ఐదేళ్ల ముందే వేయొచ్చు కదా ? అయినా మరో ఐదేళ్లు అధికారంలో ఉండేందుకు ప్రజా మద్దతు సాధించిన మీరు ఇప్పట్లో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని భావించడం బహుశా అత్యాశే అవుతుందేమో ?
