సంబంధిత వార్తలు
- సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల.. మెరిట్ లిస్ట్ నో
- సీబీఎస్ఈ పరీక్ష ఫలితాల్లో వందశాతం కొట్టిన ఘనత ఎవరిది?
- పుంజుకున్న బాంబే స్టాక్ మార్కెట్.. 37వేల మార్క్ చేరువలో..?
- అధికంగా వర్తకం జరిపిన భారతీయ మార్కెట్లు, 107 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ
- తక్కువగా వాణిజ్యం జరిపిన బెంచిమార్కు సూచీలు, 345.51 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. బలమిచ్చిన సెంటిమెంట్
శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్ఈ సూచీ 157 పాయింట్ల లాభంతో 36629 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 10786 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఐటీ, మీడియా తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా ఆర్థిక రంగ షేర్లు లాభపడుతున్నాయి.
అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు నెలకొన్నప్పటికీ.., మార్కెట్లో నెలకొన్న బలమైన సెంటిమెంట్ సూచీలను లాభాల వైపు నడిపిస్తోంది. ఇకపోతే.. బ్రిటానియా, బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, జేఎస్‌డబ్ల్యూస్టీల్, టాటాస్టీల్ షేర్లు 1శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి. టైటాన్, డాక్టర్ రెడ్డీస్, కోటక్ బ్యాంక్, జీ లిమిటెడ్, విప్రో షేర్లు అరశాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి.
