మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 జులై 2020 (09:54 IST)

పుంజుకున్న బాంబే స్టాక్ మార్కెట్.. 37వేల మార్క్ చేరువలో..?

బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం లాభాలతో ప్రారంభమైంది. బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మ రంగ షేర్ల లాభాలతో భారత స్టాక్ మార్కెట్ సూచీ 366 పాయంట్లు ఎగసి  సూచీల్లో 36960 వద్ద కొనసాగుతోంది. అలాగే నిఫ్టీ కూడా 100 పాయింట్ల లాభంతో 10863 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ ట్రిపుల్‌ సెంచరీ లాభాలను మించి కొనసాగుతోంది. 37వేల మార్క్‌కు చేరువలో ఉంది.
 
ఇకపోతే.. హిందాల్కో, రిలయన్స్‌, వేదాంతా, ఇన్ఫోసిస్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, ఇండస్‌ఇండ్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్ర, బయోకాన్‌ టాప్‌ విన్నర్స్‌గా ఉన్నాయి. మరోవైపు భారతి ఎయిర్‌టెల్‌, డా.రెడ్డీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ మాత్రం స్వల్పంగా నష‍్టపోతున్నాయి.