1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
  4. sensex gain, bse, nifty, trading

భారీ లాభాలతో ముగిసిన సెన్సెక్స్ సూచీ

sensex gain
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ భారీ లాభాలతో ముగిసింది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 321 పాయింట్ల లాభంతో 26,429 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ వంద పాయింట్ల లాభంతో 7,879 వద్ద ముగిసింది. గతవారం చివర్‌లో డీజిల్ ధర తగ్గించడంతో చమురు, సహజవాయువు, పీఎస్ యూ షేర్లలో ర్యాలీ కొనసాగడం, హర్యానాలో బీజేపీ అధికారంలోకి రావడం, మహారాష్ట్రలో కమలదళం ప్రభుత్వం ఏర్పాటవనుండటం నేపథ్యంలో మార్కెట్లు బలపడ్డాయి. 
 
ఈ ట్రేడింగ్‌లో ఓఎన్‌జీసీ, హిందాల్కో, టాటా మోటార్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ తదితర షేర్లు లాభాల బాటలో పయనించగా, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐటీసీ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు నష్టాలను చవిచూశాయి. 
About Writer
PNR