1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Drunkard man jumped from an 80-foot-tall water tank after being told not to drink alcohol, watch the video

మద్యం తాగొద్దు అన్నందుకు 80 అడుగుల వాటర్ ట్యాంకు పైనుంచి దూకేశాడు, వీడియో

Drunkard man jumped from tank
మద్యానికి బానిసలైనవారితో జీవితం నరకంగా వుంటుందని వారితో కలిసి బ్రతుకీడ్చేవాళ్లు చెబుతుంటారు. తెల్లవారింది మొదలు రాత్రయ్యేవరకూ మద్యపానంలో జోగుతూ కుటుంబాన్ని పట్టించుకోని మద్యం బానిసలు చేసే చేష్టలు కూడా చాలా దారుణంగా వుంటాయి. మద్యానికి బానిసైన వ్యక్తులు ఎంతకైనా తెగిస్తారనీ, చివరకు వారి ప్రాణాలను సైతం తీసుకుంటారని తెలిపేందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే తెలుస్తుంది.
 
ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో.... ఓ వ్యక్తి వాటర్ ట్యాంకుపైకి ఎక్కాడు. మద్యం సేవించడానికి వీల్లేదని కుటుంబసభ్యులు మందలించడంతో సదరు వ్యక్తి 80 అడుగులు ఎత్తున్న వాటర్ ట్యాంకు పైకి ఎక్కాడు. తనను మద్యం తాగవద్దని చెబితే ఇక్కడ నుంచి దూకేస్తానంటూ బెదిరించాడు. అతడిని ఎలాగో కిందికి దింపి తీసుకువచ్చేందుకు పలువురు చేసిన ప్రయత్నాలు కూడా సఫలమవ్వలేదు. చివరికి అతడు ట్యాంకు పైనుంచి దూకేసి తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది.
 
మద్యపానంతో తెలుగు రాష్ట్రాల్లో ఏటా 10,000 మంది మరణం
 
మద్యపానం వల్ల సంభవించే మరణాలు వివిధ రకాలుగా వుంటున్నాయి. మద్యపానంతో ఆరోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు వంటివి చోటుచేసుకుంటున్నాయి. అయితే, ప్రభుత్వ ఆరోగ్య శాఖ, NCRB(నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో), వివిధ అధ్యయనాల గణాంకాల ప్రకారం వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
 
లివర్, ఆరోగ్య సంబంధిత మరణాలు
మద్యపానం వల్ల కలిగే కాలేయ (Liver cirrhosis/failure), కిడ్నీ, మరియు నాడీ సంబంధిత జబ్బుల వల్ల ఏటా పదుల సంఖ్యలో వేల మంది ఆసుపత్రుల పాలవుతున్నారు
 
ఆరోగ్యశ్రీ గణాంకాల ప్రకారం ఏపీలో ఏటా సుమారు 5,000 - 8,000 మందికి పైగా ఆల్కహాల్ సంబంధిత తీవ్రమైన లివర్, కిడ్నీ వ్యాధుల వల్ల మరణిస్తున్నట్లు లేదా తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నట్లు అంచనా.
 
రోడ్డు ప్రమాదాలు (Road Accidents)
ఏపీలో జరిగే తీవ్రమైన రోడ్డు ప్రమాదాల్లో గణనీయమైన భాగం 'తాగి వాహనం నడపడం' (Drunk and Drive) వల్లే జరుగుతున్నాయి. NCRB నివేదికల ప్రకారం, ప్రతి సంవత్సరం మద్యపానం చేసి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలలో 1,000 నుండి 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు.
 
మద్యపాన వ్యసనం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు కూడా వుంటున్నారు. మానసిక ఒత్తిడి, అప్పుల బాధ, మద్యపానానికి బానిసై ఏటా సుమారు 500 నుండి 800 మంది ప్రాణాలు తీసుకుంటున్నట్లు NCRB సేకరించిన గణాంకాలు చెబుతున్నాయి.
 
ఇలా అన్ని రకాల పరోక్ష, నేరుగా కలిగే కారణాలను (లివర్ జబ్బులు, రోడ్డు ప్రమాదాలు, గృహ హింస/ఆత్మహత్యలు) కలిపి చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏటా సుమారు 8,000 నుండి 12,000 మంది వరకు మద్యపాన ప్రభావం వల్ల అకాల మరణం చెందుతున్నారని ఆరోగ్య, సామాజిక విశ్లేషకుల అంచనా.
About Writer
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి
తర్వాతి కథనం
హైడ్రా అదుర్స్.. తమ్మిడికుంట చెరువుకు కొత్త శోభ.. వరదలతో భయం లేదు (video)