మహాశివరాత్రి స్పెషల్: అటుకుల పాయసం ఎలా చేయాలి?
Atukula payasam
కావలసిన పదార్థాలు
పాలు: అర లీటరు
వెన్న : పావు కప్పు
అటుకులు : వంద గ్రాములు
జీడిపప్పు : పది గ్రాములు
ఎండు ద్రాక్షలు : పది గ్రాములు
ఏలకుల పొడి : ఒక స్పూన్
కొబ్బరి తురుము : ఒక కప్పు
బెల్లం తురుము : అర కేజీ
బాదం పప్పు : పది గ్రాములు
తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్‌లో పాలను పోసి మరిగించాలి. తర్వాత అందులో బెల్లం తురుము వేసి బాగా కలపాలి. అందులో అటుకులు వేసి సుమారు పావుగంట సేపు ఉడికించాలి. అంతలోపు మరో చిన్నపాటి పాన్‌లో నెయ్యి వేసి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్‌మిస్, బాదంపప్పు వేసి వేయించి ఉడుకుతున్న అటుకుల పాయసంలో కలిపేయాలి. ఆపై దించే ముందు ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. అంతే అటుకుల పాయసం రెడీ.
తర్వాతి కథనం
