1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. స్వీట్లు

వెన్నతో ఉండలు

వంటకాలు స్వీట్లు బటర్ వాము ఉప్పు కారం బియ్యంపిండి నూనె నువ్వులు
FileFILE
కావలసిన పదార్థాలు :
బటర్... 200 గ్రాములు
వాము... మూడు టీస్పూన్లు
ఉప్పు... సరిపడా
కారం... సరిపడా
బియ్యంపిండి...అర కిలో
నూనె...అర లీటరు.
నువ్వులు... వందగ్రాములు

తయారీ విధానం :
ముందుగా వామును రోటిలో నూరుకుని పక్కన పెట్టుకోవాలి. స్టౌవ్‌మీద ఓ మందపాటి బాణలిలో నీళ్ళుపోసి అందులో కారం, జీలకర్ర వాము వేసి కలపాలి. ఇందులో వెన్నతో కలుపుకున్న బియ్యం పిండిని మరుగుతున్న నీటిలో వేయాలి. దాన్ని ఉండలు కట్టకుండా బాగా కలియదిప్పాలి. పిండి ఉడికి, గట్టిపడుతుండగా దింపి, కాసేపు చల్లారిన తరువాత చిన్న చిన్న ఉండలు చేసుకుని నెయ్యి రాసిన ప్లేట్‌లో ఉంచుకోవాలి. ఈ ఉండలను మరుగుతున్న నూనెలో బ్రౌన్‌కలర్ వచ్చేదాకా వేయించి, పొడిగా ఉన్న డబ్బాలో నిల్వచేసుకోవాలి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి