1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Coldwave Eases as Telangana Heads into Mild Sankranti Weather

Coldwave : సంక్రాంతి పండుగ.. తెలంగాణలో చలి తీవ్రత ఎలా వుంటుంది?

Cold Wave
సంక్రాంతి పండుగ సమయంలో రాత్రులు చల్లగా, పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (ఐఎండి) బులెటిన్ ప్రకారం, వచ్చే వారం పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఆరు రోజుల తర్వాత ఇప్పటివరకు శీతలగాలుల తీవ్రత తగ్గింది. 
 
అసాధారణ వాతావరణంపై ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. సాధారణం కంటే 2డిగ్రీల సెల్సియస్ నుండి 3డిగ్రీల సెల్సియస్ తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. 
 
శనివారం జిల్లా వారీగా అందిన సమాచారం ప్రకారం, సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ మండలంలో అత్యల్పంగా 7.6°C కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, కుమురం భీమ్, వికారాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లితో సహా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 7.9డిగ్రీల సెల్సియస్ నుండి 9.1డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. 
 
హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే కొద్దిగా తక్కువగా 12.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. దీంతో చలితీవ్రత తగ్గే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఎర్రచందనం స్మగ్లర్లకు సమాచారం ఇచ్చాడు- డబ్బు సంపాదించాడు.. కానిస్టేబుల్ అరెస్ట్