1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Domestic Help Named Prime Suspect in Tanuja Murder

విశ్రాంతి ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో పురోగతి.. నేపాల్ గ్యాంగ్ హస్తం

arrest
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన విశ్రాంతి ఐపీఎస్ అధికారి భార్య తనూజ రంజన్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నేపాల్ పని మనిషి కల్పన అలియాస్ ధర్మ (30)ను మహారాష్ట్రలోని పూణెలో పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. 
 
ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు నిందితులు కోసం పలు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలించారు. హైదరాబాద్, పూణె, ముంబై, ఢిల్లీ, బీహార్‌కు చెందిన ప్రత్యేక బృందాలు పంపించి, నిందితులు దేశ సరిహద్దులు దాటకుండా పక్కాగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పట్టుబడిన ఇద్దరు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు పూణెలో తలదాచుకున్న కల్పనను అదుపులోకి తీసుకున్నారు. 
 
పోలీసుల దర్యాప్తులో ఈ హత్య వెనుక నేపాల్‌కు చెందిన సాహూ గ్యాంగ్ హస్తం ఉన్నట్టు తేలింది. ఢిల్లీ జైలు నుంచే ఈ దోపిడీకి పథకం రచించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేరం కోసం ముంబై, నేపాల్, పాట్నా నుంచి వేర్వేరు వ్యక్తులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్ధారించారు. దోపిడీ చేసిన బంగారాన్ని ముంబై నగరంలో దాచిపెట్టినట్టు కూడా పోలీసులు గుర్తించారు. కల్పనను హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి విచారిస్తే ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
Smartphone: టీబీ ఆనవాళ్లను గుర్తించే వినూత్నమైన స్మార్ట్ ఫోన్