గంజాయి మత్తు.. పెట్రోల్ బంకుకు నిప్పు పెట్టిన ఆకతాయిలు.. ఏమైంది? (video)
Nacharam
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మల్లాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నాచారం మల్లాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో.. పెట్రోల్ పడుతుండగా గంజాయి మత్తులో వున్న ఆకతాయిలు నిప్పు పెట్టారు.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అందరూ షాకయ్యారు. దీంతో అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది నిప్పును ఆర్పేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు.
గంజాయి మత్తులో పెట్రోల్ బంక్‌కు నిప్పు
— BIG TV Breaking News (@bigtvtelugu) October 26, 2024
నాచారం పీఎస్ పరిధిలోని మల్లాపూర్‌లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో ఘటన
పెట్రోల్ పడుతుండగా నిప్పు పెట్టిన ఆకతాయిలు
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. వెంటనే ఆర్పేసిన పెట్రోల్ బంక్ సిబ్బంది
యువకులను అదుపులోకి తీసుకున్న నాచారం పోలీసులు… pic.twitter.com/lNf6Aiws40
