సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జులై 2024 (17:01 IST)

డ్రైవర్ లేదు.. కానీ బస్సు తానంతట అదే నడిచింది.. వ్యక్తి మృతి.. ఎలా? (video)

Driverless Bus
Driverless Bus
సోషల్ మీడియాలో షాకిచ్చే వీడియోలు భారీగా వచ్చి పడుతున్నాయి. సీసీటీవీ ఆధారంగా పలు దిగ్భ్రాంతిని గురిచేసే వీడియోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి నెటిజన్లకు షాకిచ్చేలా చేసింది. బస్సులో డ్రైవర్ లేదు. 
 
కానీ ఆ బస్సు తానంతట అదే నడించింది. అయితే డ్రైవర్ లేకుండా పెట్రోల్ బంకులో నిల్చుండిన బస్సు ఓ ప్రాణాన్ని బలిగొంది. పెట్రోల్ బంకులో గాలి నింపుతున్న వ్యక్తిపై ఆ బస్సు నడిచింది.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌ - హర్దోయ్ జిల్లాలో ఓ పెట్రోల్ బంక్‌లో డీజిల్ నింపేందుకు వచ్చిన మినీ బస్సు.. ఏదో పనిచేయక ఆగిపోయింది. దీంతో పెట్రోల్ బంక్‌లోనే బస్సును పెట్టి టైర్ల కింద ఇటుకలను ఉంచి డ్రైవర్ వెళ్లిపోయాడు.
 
అయితే గురువారం బస్సు అకస్మాత్తుగా దానంతట అదే స్టార్ట్ అయి, టైర్లలో గాలిని నింపుతున్న పెట్రోల్ బంక్ ఉద్యోగి తేజ్‌పాల్(36) పైనుండి వెళ్లింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ తేజ్‌పాల్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.