గురువారం, 18 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 జనవరి 2024 (17:35 IST)

Hit-And-Run Law: ట్రక్కు డ్రైవర్ల ఆందోళన.. పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు

petrol bunk que
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఐపీసీ చట్టంలో కీలక మార్పులు చేసింది. న్యాయ సంహిత పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టంలో హిట్ అండ్ రన్‌పై డ్రైవర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ట్రక్కులు ఆగిపోయాయి. ఫలితంగా దేశంలోని అనేక పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బార్లు తీరాయి. పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారుు ఒక్కసారిగా పోటెత్తడంతో చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెట్రోలు బంకులన్నీ ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి. కేంద్రం తీసుకొస్తున్న కొత్త శిక్ష చట్టంలోని కఠినమైన హిట్ అండ్ రన్ నిబంధనకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ పాటు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. దీంతో అనేక పెట్రోల్ బంకులకు పెట్రోల్ సరఫరా కాలేదు. ఫలితంగా పెట్రోల్ ఉన్న బంకుల వద్ద భారీ సంఖ్యలో వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాయి. 
 
బ్రిటిష్ కాలం నాటి పాత శిక్ష స్థానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంలో ప్రమాదం చేసి పారిపోయినా (హిట్ అండ్ రన్), ఘటనకు సంబంధించిన సమాచారంపై ఫిర్యాదు చేయకున్నా పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. దీనిపై డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్లు ఆందోళనకు దిగారు. ట్రక్కులను నిలిపివేసి ఆందోళనకు దిగారు. 
 
హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. రోడ్లను దిగ్బంధించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వాహనాలను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారు. ఇండోర్‌లో డ్రైవర్లు ముంబై - ఆగ్రా జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో నిత్యావసర సరకుల రవాణా నిలిచిపోయింది. అలాగే, అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.