బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2023 (11:04 IST)

వ్యూహం.. డిసెంబర్ 29న రిలీజ్.. ఆర్జీవీ ఆఫీసు ముందు టీడీపీ ఆందోళన

vyooham movie teaser 2
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. ఇటీవలే విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వ్యూహం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. థియేటర్లతోపాటు, ఓటీటీల్లోనూ సినిమా రిలీజ్ చేయొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వ్యూహం రిలీజ్ డేట్ మార్చారు వర్మ. ఈ చిత్రాన్ని ఈనెల 27న కాకుండా.. డిసెంబర్ 29న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు వర్మ. ఈ క్రమంలోనే నిన్న ఆర్జీవీ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు టీడీపీ కార్యకర్తలు.
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిలింనగర్‏లో టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వర్మ. ఈ ఘటనపై నిర్మాత దాసరి కిరణ్ మాట్లాడుతూ.. సినిమాను సినిమాగానే చూడాలని అన్నారు. ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫై చేసిన తర్వాత కూడా టీడీపీ కార్యకర్తలు ఇలా దాడులు చేయడం సరికాదని  చెప్పారు.