రిలయన్స్ జియో దీపావళి ధమాకా: Jio True 5G ప్రీపెయిడ్ ప్లాన్.. ఫీచర్స్ ఇవే
రిలయన్స్ జియో తన అద్భుతమైన 'దీపావళి ధమాకా' ఆఫర్‌ను ప్రారంభించింది. భారతదేశం అంతటా ఉన్న వినియోగదారులకు వివిధ రకాల పండుగ ప్రయోజనాలను ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తోంది. Jio True 5G ప్రీపెయిడ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేయడం ద్వారా, కస్టమర్‌లు ప్రయాణం, ఫుడ్ డెలివరీ, ఆన్‌లైన్ షాపింగ్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో రీడీమ్ చేసుకోగలుగుతారు. తద్వారా మొత్తం రూ.3350 వోచర్‌లను పొందవచ్చు.
ఆఫర్‌లో రెండు ప్రధాన ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఉన్నాయి. రూ.899తో త్రైమాసిక ప్లాన్ ట్రూ అన్‌లిమిటెడ్ 5G సేవలు, అపరిమిత కాల్‌లు, రోజుకు 2GB డేటాతో పాటు 90 రోజుల పాటు అదనంగా 20GBని అందిస్తుంది. దీర్ఘకాలిక ప్లాన్ కోసం, రూ.3599 వార్షిక ప్లాన్ పొందవచ్చు. ఈ ప్లాన్ ప్రకారం రోజుకు 2.5GB డేటాను అందిస్తుంది. ఇది ఒక సంవత్సరం పాటు అంతరాయం లేని సేవను అందిస్తుంది.
* EaseMyTrip వోచర్‌లు: రూ.3000 విలువ, హోటల్ బుకింగ్‌లు, విమాన ప్రయాణాలకు వర్తిస్తుంది.
* అజియో కూపన్: రూ.999 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్లపై రూ.200 తగ్గింపు.
* స్విగ్గీ వోచర్: ఫుడ్ డెలివరీ కోసం రూ.150 తగ్గింపు.