సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 అక్టోబరు 2024 (11:20 IST)

రూ.1029 రీచార్జ్ ప్లాన్‌ను సవరించిన రిలయన్స్ జియో..

jio reliance
ప్రస్తుతం ఉన్న మొబైల్ వినియోగదారులను నిలబెట్టుకోవడం, కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు వీలుగా ప్రైవేట్ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తుంది. ఇందులోభాగంగా, తాజాగా, రూ.1029 ప్లాన్ను సవరించింది. ఈ ప్లాన్ కింద ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్ఫామ్ల సబ్‍‌స్క్రిప్షన్లను అందిస్తున్న కంపెనీ.. అప్‌డేట్ భాగంగా కొత్తగా అమెజాన్ ప్రైమ్ లైట్‌ను జోడించింది. దీంతో అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ సేవలను కూడా వినియోగదారులు ఆస్వాదించవచ్చు. అమెజాన్ ప్రైమ్ లైట్లో కస్టమర్లు రెండు పరికరాల్లో (టీవీ లేదా మొబైల్) స్ట్రీమింగ్‌ను వీక్షించవచ్చు. కాగా ఇప్పటికే అందిస్తున్న ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌లో ఒక మొబైల్ డివైజ్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది.
 
కాగా ఓటీటీ ప్లాట్‌‍ఫామ్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్‌ను కోరుకునేవారికి రూ.1029 ప్లాన్ చక్కటి ఆఫర్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అపరిమిత ఉచిత కాలింగ్, ప్రతి రోజు 100 ఉచిత మెసేజులు పొందొచ్చు. ప్రతి రోజు 2 జీబీల హైస్పీడ్ డేటాను పొందవచ్చు. అంతేకాదు కస్టమర్ ఉన్న ప్రాంతంలో 5జీ కనెక్టివిటీ ఉంటే అపరిమిత 5జీ డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు.
 
కాగా జులై నెలలో జియో తన రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. జియోతో పాటు ఎయిర్టెల్, వీ (వొదా ఐడియా) కూడా టారీఫ్ రేట్లను పెంచాయి. దీంతో చాలా మంది కస్టమర్లు ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. దీంతో కస్టమర్లను నిలుపుదల చేసుకోవడంలో భాగంగా ప్రభుత్వ టెలికం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్లను ఆకర్షణీయంగా మార్చుతున్నాయి.