బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2024 (19:13 IST)

జియో యూజర్లకు శుభవార్త.. 100 జీబీ ఉచిత స్టోరేజీ!!

mukesh ambani
రిలయన్స్ జియో యూజర్లకు మరో శుభవార్త చెప్పింది. వచ్చే దీపావళి పండుగ సందర్భంగా ఏఐ క్లౌడ్ స్టోరేజ్‌ సేవలను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో జియో తన వినియోగదారులకు తీపి కబురు చెప్పింది. వెల్‌కమ్ ఆఫర్ కింద యూజర్లకు 100జీబీ ఉచిత స్టోరీజీని ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు గురువారం జరిగిన రిలయన్స్ 47వ వార్షిక సాధారణ సమావేశంలో అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించారు. 
 
ఈ సంద్భంగా ఆయన వాటాదారులను ఉద్దేశించి ప్రసంగించారు. డాక్యుమెంట్లు, ఫోటోలు, వీడియోలు వంటి డిజిటల్ కంటెంట్‌ను జియో యూజర్లు సురక్షితంగా దాచుకునేలా జియో క్లౌడ్ స్టోరేజీని తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం వెల్‌‍కవమ్ ఆఫర్ కింద 100 జీబీ క్లౌడ్ స్టోరేజీని ఫ్రీగా అందించాలని నిర్ణయించామని, ఇంకా అధిక మోతాదులో క్లౌడ్ స్టోరేజీ కావాలనుకేవారికి మాత్రం సరసమైన ధరల్లోనే అందించడం జరుగుతుందన్నారు. 
 
ఏఐ అనేది కొందరికి మాత్రమే అంటే లగ్జరీగా మిగిలిపోకూడాదని మేం భావిస్తున్నట్టు తెలిపారు ఏఐ సేవలు అందరికీ అందుబాటులో తీసుకుని రావాలనేదే తమ ఉద్దేశ్యమన్నారు. కృత్రిమ మేథను అందిపుచుకుని జియో వినియోగదారుల కోసం ఏఐ ఫ్లాట్‌ఫామ్ జియో బ్రెయిన్ మరింత విస్తరిస్తున్నట్టు చెప్పారు. తక్కువ ధరకే ఏఐ మోడల్ సర్వీసులను అందిస్తామన్నారు.