శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2024 (20:08 IST)

Reliance Jio: 14 రోజులపాటు అపరిమిత 5జీ డేటా

jioservice
టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. ఇటీవల టారిఫ్ రేట్లను గణనీయంగా పెంచడంపై కస్టమర్లు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఎక్కువ డేటా వాడే వినియోగదారుల కోసం జియో అందిస్తున్న ఓ ఆఫర్ ఆకట్టుకుంటోంది. 
 
కొత్తగా రూ.198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌‌ను ఇటీవలే రిలయన్స్ జియో ప్రకటించింది. 14 రోజుల వ్యాలిడిటీ ఉండే ఈ ఆఫర్ కింద అర్హులైన కస్టమర్లు అపరిమిత 5జీ డేటాను పొందొచ్చు.
 
జియో అందిస్తున్న చౌకైన ఆఫర్లలో ఈ ప్లాన్ ఒకటిగా ఉంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్‌, ప్రతి రోజు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు రోజుకు 2 జీబీ 4జీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో జియో యాప్‌ సర్వీసులు కూడా పొందవచ్చు. జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమా యాప్‌ సేవలు లభిస్తాయి.
 
కాగా రూ.198 రీఛార్జ్ ప్లాన్‌తో సమానమైన సేవలను 28 రోజులపాటు పొందాలనుకుంటే రూ.349 ప్లాన్‌ను రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది.