రోజుకు రూ.10 వ్యయంతో 98 రోజుల వ్యాలిడిటీతో రీచార్జ్ ప్లాన్!
భారత టెలికాం దిగ్గజ కంపెనీ రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ ఎంచుకునేవారికి రోజుకు పది రూపాయల సమాన వ్యయంతో 98 రోజుల కాలపరిమితితో 999 రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కింద ప్రతి రోజూ 2 జీబీ డేటాను ఇవ్వనుంది. వంద ఎస్ఎంఎస్‌లు, అపరిమిత కాలింగ్స్ లభిస్తాయి. అలాగే, అపరిమిత 5జీ ఇంటర్నెట్ యాక్సెస్ సేవలను కూడా పొందవచ్చు. అలాగే, జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమా వంటి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్లను కూడా రిలయన్స్ కస్టమర్లు పొందవచ్చు.
గత జూన్ నెలలో ఎయిర్‌టెల్, వొడాఫోన్‌తో పాటు రిలయన్స్ జియో కంపెనీలు ప్రీపెయిడ్ టారిఫ్ రేట్లను భారీగా పెంచిన విషయం తెల్సిందే. దీంతో అనేక మంది కస్టమర్లు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌కు మారిన విషయం తెల్సిందే. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని దిద్దిబాటు చర్యగా కస్టమర్లను నిలుపుదల చేసుకునేందుకు జియో సరసమైన ఈ రూ.999 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. మరోవైపు ఎయిర్ టెల్ కూడా పలు కొత్త ప్లాన్లను ప్రకటించింది. అదనపు డేటా ప్లాన్‌ల వ్యాలిడిటీలను పెంచుతూ పలు సరమైన ఆఫర్లను ప్రకటించింది.