1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Head Constable Punches Wife After She Asked Him To Stop Boozing

మద్యపానం మానేయమని చెప్పిన భార్య... ముక్కుపై దాడి చేసిన హెడ్ కానిస్టేబుల్

crime scene
మద్యపానం మానేయమని చెప్పినందుకు భార్యపై గాడి చేయడమే కాకుండా, ఆమెను బెదిరించి వేధించిన టీజీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ ఒకరిపై కేసు నమోదైంది. మద్యం మత్తులో ఉన్న ఆమె భర్త జలంధర్ గౌడ్ యూసుఫ్‌గూడలోని వారి ఇంట్లో బాధితురాలిపై దాడి చేశాడు. రెండు రోజుల క్రితం గౌడ్ మద్యం మత్తులో ఇంటికి రాగా, మద్యం మానేయమని హిమయతి కోరినందుకు అతను ఆమె ముక్కుపై దాడి చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. 
 
మద్యం సేవించి రాత్రిపూట పిల్లలను వేధిస్తుండగా తాను అతడిని అడ్డుకున్నప్పుడు, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. 
 
2020లో గౌడ్‌ను వివాహం చేసుకున్న హిమాయతి, తన భర్త గతంలో కూడా తనను, పిల్లలను వేధించేవాడని చెప్పింది. 2023లో ఇలాంటి మూడు వేధింపుల ఘటనలపై ఆమె పోలీసులను ఆశ్రయించడానికి ప్రయత్నించింది. అయితే, తన పిల్లల కోసం,తన భర్త ఉద్యోగాన్ని కాపాడటం కోసం ఆమె తిరిగి వచ్చేసింది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
దసరా పండుగ దృష్ట్యా 7,000 ప్రత్యేక బస్సులను నడపనున్న టీజీఎస్సార్టీసీ