తెలంగాణలో అర్నబ్ సైక్లోన్.. రాబోయే 24 గంటల్లో వర్షాలు ఎక్కడెక్కడంటే?
తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సాయంత్రం సమయానికి వర్షాలు ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల వైపు విస్తరించే అవకాశం ఉంది. నల్గొండ, యాదాద్రి-భువనగిరి, జనగామ, హనుమకొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో రాబోయే 24 గంటల పాటు అప్పుడప్పుడు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉండగా, ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇతర జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

