సంబంధిత వార్తలు
- TGSRTC : బడ్జెట్-ఫ్రెండ్లీ గోవా టూర్ ప్యాకేజీని ప్రారంభించిన టీజీఎస్ఆర్టీసీ
- మా మంత్రులను బద్నాం చేస్తే సహించను... వార్తలు రాసేముందు వివరణ అడగండి : సీఎం రేవంత్
- తెలంగాణ రాష్ట్రానికి మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ : హరీశ్ రావు ధ్వజం
- మహిళ ప్రాణాలు తీసిన కోతుల గుంపు
- తప్పు తెలుసుకున్నా.. ఇకపై చులకనగా మాట్లాడను : నటుడు శివాజీ
ప్చ్... ఆశించిన ఫలితాలు రాలేదు... కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే : కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో తాము ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని, అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం వెల్లడైన ఈ ఫలితాలపై కేటీఆర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తమ పార్టీ 30కిపైగా మున్సిపాలిటీలు గెలుస్తామని అనుకున్నాం.. కానీ, కొంత తగ్గిందన్నారు. హంగ్ వచ్చిన చోట్ల కూడా తమకు అనుకూలంగా ఉంటుందన్నారు.
'కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించిన మేర మున్సిపాలిటీలు రాలేదు. కరీంనగర్, నిజామాబాద్ మినహాయిస్తే భాజపా ప్రభావం ఎక్కడా లేదు. స్థానికంగా జరిగిన ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టే పొత్తులు ఉంటాయి. వాటి ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదు. సింగరేణి కార్మికులకు అండగా ఉంటామన్న సందేశం ఇచ్చే ఆలోచనతోనే కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇస్తున్నాం' అని కేటీఆర్ వివరించారు.
జస్ట్ టెన్ మినిట్స్ టైమ్ ఇవ్వండి సర్.. 19 యేళ్ళ కుర్రోడు...
వైద్య విద్యలో ప్రవేశం కోసం రెండుసార్లు నీట్ పరీక్షలో అర్హత సాధించినా, ప్రభుత్వ విధానపరమైన లోపం కారణంగా సీటు కోల్పోయిన ఓ విద్యార్థి.. దేశ అత్యున్నత న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించి చారిత్రాత్మక విజయం సాధించాడు.
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల అథర్వ చతుర్వేది పోరాటానికి స్పందించిన సుప్రీంకోర్టు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి అతనికి ప్రొవిజనల్ ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది.
జబల్‌పూర్‌కు చెందిన అథర్వ చతుర్వేది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటా కింద రెండుసార్లు నీట్లో మంచి మార్కులు సాధించాడు. అయితే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయకపోవడంతో అతడికి అడ్మిషన్ లభించలేదు. దీనిపై తొలుత హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు అథర్వ ఆన్‌లైన్‌లో తన వాదనలను స్వయంగా వినిపించాడు. రాష్ట్ర ప్రభుత్వ విధాన లోపం వల్ల అర్హత ఉన్న విద్యార్థికి అన్యాయం జరగకూడదని స్పష్టం చేసిన ధర్మాసనం కేవలం 10 నిమిషాల్లోనే అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
అంతేకాకుండా, 'ప్రైవేట్ కాలేజీలు రిజర్వేషన్ విధానాన్ని పాటించకపోతే, వాటికి తాళాలు వేయండి' అని ఈ సందర్భంగా సీజేఐ ఘాటుగా వ్యాఖ్యానించారు. వారం రోజుల్లోగా 2025-26 విద్యా సంవత్సరానికి అథర్వకు ప్రొవిజనల్ అడ్మిషన్ కల్పించాలని నేషనల్ మెడికల్ కమిషన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
