రెస్క్యూ బోట్లు బోల్తా.. గల్లంతైన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సేఫ్..
SDRF
భారీ వర్షాల కారణంగా వరద నీటిలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు పదిమంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఒక స్థానిక వ్యక్తి చెరువులోకి వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న రెస్క్యూ బోట్లు బోల్తా పడటంతో, వారంతా వరద నీటిలో కొట్టుకుపోయారు.
బుధవారం రాత్రి 3 గంటల సమయానికి ఐదుగురు సిబ్బంది సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. మిగిలిన ముగ్గురి ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన నెలకొంది. అయితే, వారు కూడా సురక్షితంగానే ఉన్నారని గురువారం ఉదయం అధికారులు ధృవీకరించారు.

