బుధవారం, 1 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 మార్చి 2026 (19:44 IST)

మద్యం మత్తుతో తల్లిని, చెల్లిని వేధిస్తావా.. గొడ్డలితో నరికేసిన కుమారుడు

Crime
మద్యం మత్తులో కన్నతల్లిని, చెల్లిలిని వేధిస్తున్నాడనే ఆవేశంతో ఓ కుమారుడు కన్నతండ్రినే కడతేర్చాడు. పెద్దెముల్ మండల పరిధిలోని బామిమీది తండాలో.. రాథోడ్ లోక్య నాయక్ గత కొంతకాలంగా మద్యానికి బానిసై భార్య బిక్కి బాయిని, చిన్న కుమార్తెను మద్యం తాగి వేధిస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 27వ తేదీ ఉదయం కూడా లోక్య నాయక్ వారిపై తీవ్రంగా దాడికి పాల్పడ్డాడు. 
 
భర్త వేధింపులు భరించలేకపోతున్నామని తన కుమారుడు రాథోడ్ సునీల్ నాయక్‌కు ఫోన్ చేసి కన్నీరుమున్నీరైంది. తల్లి ఫోన్ చేయడంతో హుటాహుటిన తండాకు చేరుకున్న సునీల్ నాయక్.. తండ్రి ప్రవర్తనపై నిలదీశాడు. 
 
ఈ క్రమంలో తండ్రీకొడుకల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవేశంతో సునీల్ నాయక్ ఇంట్లోని గొడ్డలితో తండ్రి తల వెనుక బలంగా నరికాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో లోక్య నాయక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని.. శనివారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.