తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ.. పిడుగులు పడే అవకాశం
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వర్షంతో పాటు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
