1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Older iPhones may get pricier as Apple withdraws retail incentives

iPhones: ఐఫోన్ ధరలు పెరిగే అవకాశం.. ఐఫోన్ 15, 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఖరీదవుతాయా?

iPhone 17e
ఐఫోన్ మాతృసంస్థ యాపిల్ ఆఫ్‌లైన్ రిటైలర్ల కోసం ఉద్దేశించిన ఓ కీలక ప్రోత్సాహక కార్యక్రమాన్ని నిలిపేయడంతో దేశీయంగా పాత ఐఫోన్ మోడళ్ల వాస్తవ ధరలు పెరిగే అవకాశం ఉందని రిటైలర్లు చెప్పినట్టు మనీకంట్రోల్ నివేదిక పేర్కొంది. 
 
డిమాండ్‌ను పెంచే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం, పాత తరం ఐఫోన్‌లపై క్యాష్‌బ్యాక్ పథకాలు, ప్రమోషనల్ డిస్కౌంట్ల కోసం రిటైల్ పార్ట్‌నర్లకు అవకాశం కల్పించింది. 
 
తాజాగా దీన్ని నిలిపేయడంతో రిటైలర్లు కస్టమర్లకు ఆఫర్లు అందించడం కుదరకపోవచ్చు. దీనివల్ల ఐఫోన్ 15, 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఖరీదవుతాయి. ఫలితంగా ఈ ఐఫోన్లు రూ.5వేల వరకు పెరగవచ్చునని నివేదిక పేర్కొంది. 
 
అయితే ఈ మోడళ్లు కొత్తగా ఐఫోన్లు కొనే కస్టమర్ల కోసం ఉద్దేశించినది కావడంతో అమ్మకాలపై ప్రభావం వుండొచ్చనని మార్కెట్ వర్గాల సమాచారం. రిటైలర్లు ప్రమోషన్లను ఇవ్వకపోవడంతో సమీప భవిష్యత్తులో ఐఫోన్ల డిమాండ్, మార్జిన్లను ప్రభావం పడే అవకాశం వుంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
రెడ్‌మి 15A 5G: మీరు అనుభూతి చెందే పనితీరు, దీర్ఘకాలిక విశ్వసనీయత