1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. telangana cm revanth reddy fire on brs leaders

సూర్యాపేటలో ఓ జానెడు ఉన్న వ్యక్తి మిగిలిండు... : సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy
తులసివనంలో గంజాయి మొక్కలా సూర్యాపేటలో ఒక జానెడు ఉన్న వ్యక్త మిగిలిండు. వచ్చే ఎన్నికల్లో ఆయనను కూడా గెలవనివ్వం అంటూ భారత రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. 
 
సూర్యాపేటలో జరిగిన జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆరగిస్తున్న సన్నబియ్యమే పేదలకు కూడా ఇస్తున్నామని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ ఫామ్‌హౌస్‌లలో ఏ సన్న బియ్యం తింటున్నారో అదే బియ్యాన్ని తమ ప్రభుత్వం దళితులకు, ఆదివాసీలకు అందిస్తోందన్నారు. కేసీఆర్ కుటుంబం వందల కోట్ల రూపాయల వ్యయంతో ఫామ్‌ హౌస్‌లు కట్టుకోవచ్చని, కానీ పేదలకు తాము రూ.5 లక్షలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తుంటే ప్రతిపక్షాలకు ఎందుకు కడుపు మంట అని ఆయన నిలదీశారు. 
 
రూ.100 పెట్రోల్ వంటిపై పోసుకుని 10 పైసల అగ్గిపెట్టే తెచ్చుకోని అగ్గిపెట్టె రావుది త్యాగమైతే తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతా చారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, కిషన్ రెడ్డిల బలిదానాలు ఏమనాలి అని ప్రశ్నించారు. మంత్రి పదవులు అనుభవించి, వేల కోట్లు దోచుకుని, వందేళ్ల విధ్వంసం సృష్టించిన మిమ్మలను ఏమనాలి అంటూ విపక్ష సభ్యులతో ఆయన మండిపడ్డారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో త్యాగాలు చేశామని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు పదవుల కోసం ఎన్నికలు, సెలక్షన్లు, కలెక్షన్ల పేరుతో ఆస్తులు పోగేసుకున్నారని ధ్వజమెత్తారు.


 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
కొండెక్కిన గుడ్డు... తెలంగాణాలో అమాంతం పెరిగిపోయింది...