ప్రధాని మోడీ ఆశీస్సులు ఉంటే రాష్ట్ర అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీసులు ఉంటే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందుతుదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రధాని మోడీ వికసిత్ భారత్‌తో కలిసి నడుస్తామని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయాయని.. ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడాల్సిన పని లేదని చెప్పారు. అభివృద్ధి గురించే మాట్లాడదామన్నారు. హెచ్‌ఐసీసీలో ప్రధాని చేతుల మీదుగా వర్చువల్‌గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానితో పాటు సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు.
'దేశ జనాభాలో తెలంగాణ 3 శాతం వాటా కలిగి ఉంది. దేశ జీడీపీకి తెలంగాణ 5 శాతం వాటా ఇస్తోంది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు.. తెలంగాణ రాష్ట్రం మరింత ముందుకెళ్లేందుకు అవసరమైన అభివృద్ధి ఉత్సవం. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల వాటా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఎకానమీని తెలంగాణ సాధిస్తుంది. మోడీ ఆశీర్వాదం ఉంటే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుంది. దేశాభివృద్ధిలో ఆరు మహానగరాలు కీలక పాత్ర పోషిస్తాయి. దేశానికి సింహభాగం ఆదాయం ఇస్తున్న ఆ ఆరు నగరాలను కేంద్రం ప్రోత్సహించాలి' అని రేవంత్‌రెడ్డి అన్నారు.
ప్రమాణ స్వీకారానికి ముందే కేంద్ర ఉత్తర్వులు పాటించిన సీఎ విజయ్
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే కేంద్ర ఉత్తర్వులను ఆయన పాటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ప్రారంభానికి ముందు వేదికపై వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఆ తర్వాత 'జాతీయ గీతం', పిమ్మట 'తమిళ తల్లి' (తమిళ తాయ్) గీతాలను ఆలపించారు. అయితే గాయకులు వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలనూ పాడడం అందరి దృష్టిని ఆకర్షించింది.
సాధారణంగా అన్ని అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరంలోని రెండు భాగాలను మాత్రమే ఆలపిస్తారు. అయితే ఇకపై అందులోని ఆరు చరణాలనూ పాడాలని సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రమాణస్వీకారం సమయంలో తమిళనాడు కొత్త ప్రభుత్వం కేంద్రం నిబంధనలను పాటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బంకించంద్ర ఛటర్జీ తొలుత 1875లో వందేమాతరాన్ని రచించారు. తర్వాత తన ఆనంద్‌మఠ్ నవలలో దీన్ని భాగం చేశారు. స్వాతంత్య్రానంతరం నెహ్రూ ప్రభుత్వం వందేమాతరాన్ని జాతీయ గేయంగా ప్రకటించింది. దీనిలో ఆరు చరణాలుగా ఉండగా.. అందులో మతపరమైన ప్రస్తావన లేని రెండు భాగాలను మాత్రమే నాటి ప్రభుత్వం స్వీకరించింది.
అయితే 'వందేమాతరం' 150వ వార్షికోత్సవాలను నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఆరు చరణాలనూ పాడాలని సూచిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల పౌర పురస్కారాలు ఇచ్చే సమయంలో, రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమాల్లో వందేమాతరం ఆలపించాలని తెలిపింది. దీంతో సీఎం విజయ్ తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని తొలుత వందేమాతరం గీతంతో ప్రారంభించారు.
