36 -37 డిగ్రీల సెల్సియస్: హైదరాబాదులో పెరిగిన ఉష్ణోగ్రతలు
హైదరాబాదులో మంగళవారం ఉష్ణోగ్రతలు పెరిగాయి. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 36 నుండి 37 డిగ్రీల సెల్సియస్‌కు, ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 39 నుండి 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ రిపోర్ట్ చెప్తోంది.
మధ్యాహ్నం నుండి రాత్రి వేళల మధ్య సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, గద్వాల్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ రిపోర్ట్ పేర్కొంది.
ఇతర ప్రాంతాల్లో మాత్రం వాతావరణం పొడిగానే ఉంటుంది. సాయంత్రం వేళల్లో పశ్చిమ, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాల్లో అక్కడక్కడా స్వల్ప వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే, భారీ వర్షాలు కురిసే అవకాశం మాత్రం లేదని తెలంగాణ వెదర్‌మ్యాన్ రిపోర్ట్ తెలిపింది.
