1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Young Woman harassed by unidentified man

వాకింగ్‌కు వెళ్లినా వదలరా? హైదరాబాదులో మహిళకు వేధింపులు.. వీడియో

Hyderabad
Hyderabad
మహిళలకు ఎక్కడపడితే అక్కడ వేధింపులు జరుగుతున్నాయి. వయోబేధం లేకుండా.. ఎక్కడపడితే అక్కడ మహిళలపై అకృత్యాలు జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది.

నానక్‌రామ్‌గూడ సమీపంలోని సైకిల్ ట్రాక్‌పై రన్నింగ్ చేస్తుండగా ఓ మహిళకు వేధింపులు ఎదురయ్యాయి. ఈ సంఘటన నగర భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రన్నింగ్ చేస్తూండగా ఓ యువకుడు బాధితురాలిని వెంబడించి అసభ్యంగా ప్రవర్తించబోయాడు. అప్రమత్తమైన యువతి నిందితుడిని వీడియో తీయబోగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. 
 
నగరం సురక్షితమని భావించిన తనకు ఇలాంటి అనుభవం ఎదురవడం షాక్‌గా ఉందని తెలిపింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మహిళల భద్రతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
Infosys: ఒక్క వారం రోజుల లోపే రూ. 2 లక్షల కోట్లు ఆవిరి, ఏం జరిగింది?