1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Narasapur Woman Suicide in Bahrain

బహ్రెయిన్‌లో నరసాపురం యువతి ఆత్మహత్య

suicide
జీవనోపాధి కోసం బహ్రెయిన్‌ దేశానికి వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం వాసి వర్ధనపు కవిత (23) అక్కడ ఈ నెల 23న ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన కవిత తండ్రి గతంలోనే మృతి చెందగా తల్లి లూథియా ఉపాధి నిమిత్తం కొన్నేళ్లుగా కువైట్‌లో ఉంటున్నారు. కవిత, ఆమె ముగ్గురు అక్కలు చిట్టవరంలో పెదనాన్న ఇంట్లో ఉంటున్నారు. కుటుంబానికి ఆసరాగా నిలవాలనే యోచనతో కవిత తెలిసిన వారి ద్వారా నాలుగు నెలల కిందట బహ్రెయిన్‌ వెళ్లారు. 
 
అక్కడ ఓ ఇంట్లో పనిలో చేరిన ఆమె ఈ నెల 23న గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై ఆ ఇంటి యజమాని కువైట్‌లో ఉన్న ఆమె తల్లికి చరవాణి ద్వారా సందేశం పంపారు. దాని సారాంశం అర్థం కాకపోవడంతో ఆమె ఆ సందేశాన్ని ఇక్కడి బంధువులకు పంపగా విషయం వెలుగు చూసింది. 
 
కవిత ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని, దీనిపై తెలుగు సంఘాల ప్రతినిధులు అక్కడి అధికారులకు ఫిర్యాదు చేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కవిత మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని కోరుతూ ఆమె కుటుంబ సభ్యులు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సుశాంక్ సింగ్ మృతి కేసు : నటి రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్